శ్రావణ మాసంలో నేడు చివరి శుక్రవారం కావటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే మహిళలు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రావణ శుక్రవారం మహిళలకు ప్రీతికరమైన రోజు కావటంతో.. అమ్మవారికి తెల్లవారుజాము నుంచే పూజలు చేస్తున్నారు. నేడు శ్రావణమాస వ్రతాలు అధికంగా జరగనున్నాయి.