శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు దేవకీ వసుదేవులకు శ్రీ కృష్ణుడు చెరసాలలో జన్మించాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని హిందూవులు ఎంతో ప్రీతికరంగా జరుపుకుంటారు.
కృష్టాష్టమి రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడను నైవేద్యంగా సమర్పిస్తారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి కీర్తనలు ఆలపిస్తారు.