కొంతమంది నకిలీ పోలీసులుగా నటిస్తూ మోసాలకు పాల్పడుతుంటారు. కానీ, ఓ ముఠా ఏకంగా నకిలీ పోలీసు స్టేషన్నే ఏర్పాటు చేసి 8 నెలలుగా నిర్వహించిన ఘటన బీహార్లోని బాంకా సిటీలో వెలుగుచూసింది. అయితే, వీరి వద్ద దేశీయ తుపాకులను గుర్తించిన ఓ వ్యక్తి ఆరా తీయగా.. విషయం బయటపడింది. దీంతో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, టౌన్ పీఎస్కు, స్థానిక ఎస్పీ నివాసానికి సమీపంలోనే పెట్టడం గమనార్హం.