ఏపీ ప్రభుత్వంపై సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. తనకు సస్పెన్షన్ విధించిన నాటి నుంచి పూర్తి జీతం ఇవ్వాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏబీవీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.