ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలో ఈ-హాజరు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొదట విద్యాశాఖలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని, నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్ వేస్తారన్నది నిజం కాదన్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవటానికి, సాంకేతిక అవగాహన కోసం టీచర్లకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa