తాడికొండ: డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని పత్తి ఇతర పంటలపై మందులు పిచికారి చేస్తే రైతులకు పెట్టుబడి వ్యయం ఆదా అవుతుందని లాం శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం అన్నారు. గుంటూరు లాం కేవీకేలో విద్యార్థులకు డ్రోన్ పత్తి పంటపై మందులు పిచికారీ చేయడంపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో తక్కువ సమయంలో ముందు పిచికారి చేయవచ్చని, దీనికి తోడు ఖర్చులు కూడా తక్కువ అవుతాయన్నారు.