గుంటూరు: జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24 మందికి కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుమయా ఖాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 14, మంగళగిరిలో 4, తాడేపల్లిలో 3, పెదకాకానిలో 2 తాడికొండలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. కేసులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.