విశాఖలో పట్టపగలు హత్యకు గురైన రౌడీషీటర్ అనిల్ కేసును పోలీసులు ఛేదించారు. హతుడు అనిల్ తరచూ వేధిస్తుండటంతో శ్యామ్ మరికొందరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది ఈ మేరకు ప్రధాన నిందితుడు శ్యామ్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డిసిపి నాగన్న తెలిపారు.
విశాఖలోని ఎంపీపీ కాలనీ ఆదర్శనగర్ లో బంటు అనిల్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు డ్రైవర్గా గతంలో పనిచేసే అనిల్ కాకినాడలో పలు నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై కాకినాడలో రౌడీషీట్ తెరిచారు ఈ దశలో అనిల్ కు విశాఖలోని శ్యాం అనే డ్రైవర్తో స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే కాకినాడలో రౌడీయిజం చేసే అనిల్ విశాఖలో కూడా శ్యామ్ దాదాగిరీ చేసేవాడు.
దీంతో శ్యామ్ రెండేళ్ల క్రితం అనిల్ తో ఘర్షణ పడ్డాడు. ఈ దశలో బుధవారం మధ్యాహ్నం ఎంవిపి కాలనీ ఆదర్శనగర్ లో అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవించడానికి శ్యామ్ మరో ఇద్దరితో కలిసి వెళ్ళాడు. అదే బార్కు అనిల్ కూడా తర్వాత వెళ్ళాడు. మద్యం సేవించే సమయంలో అనిల్ యధావిధిగా శ్యాం ను తక్కువ చేస్తూ ప్రవర్తించాడు. చాలా కాలంగా ఈ విషయంపై కోపంగా ఉన్న శ్యామ్ బార్ నుంచి బయటికి వస్తు అనిల్ ను కత్తితో పొడిచి చంపేశాడు ఆ సమయంలో శాంత పాటు ఎర్రయ్య సమీర్ అనే ఇద్దరు కూడా ఉన్నారు వీరు కూడా అనిల్ హత్యలో సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఈ మేరకు ముగ్గురి అరెస్ట్ చేసినట్టు డిసిపి నాగన్న వివరించారు. హత్యకు పాల్పడిన శ్యామ్ ఓ విద్యాసంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను కూడా ఇటీవల కొన్ని నేరాలలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.