విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి ఈనెల 26 వతేదీన విశాఖ నగరానికి రానున్నారు. ప్లాస్టిక్ నిషేధం కోసం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) చేపడుతున్న కార్యక్రమాలు, బీచ్ క్లీనింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు బీచ్‌లో లేదా ఇండోర్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.