విశాఖపట్నం: జిల్లాలో సుమారు శిశు మరణాలు ఆగడం లేదు. పాడేరు మండలంలోని మొదపల్లి పంచాయతీలోని గుర్రగరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు నెలలలోపు ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీనితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరో 10 మంది చిన్నారులు జ్వరాలతో బాధపడుతున్నారని తక్షణమే అధికారులు స్పందించి గుర్రగరువు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.