ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో సీబీఐ దాడులపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. 'మా ఇంట్లో సీబీఐ అధికారులకు స్వాగతం పలికాం. దర్యాప్తునకు మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. అప్పుడే నిజానిజాలు త్వరగా బయటకు వస్తాయి. అప్పటిదాకా నా మీద ఎన్నికేసులు పెట్టినా ఏమీ జరగదు. అయితే.. దేశం కోసం మంచి పనులు చేస్తోన్న వారిని ఇలా వేధించడం దురదృష్టకరం.' అని సిసోదియా ట్వీట్ చేశారు.