కర్ణాటకలో ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి చంపాడు. గత శనివారం హాసన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శివకుమార్, చైత్ర దంపతుల మధ్య రెండేళ్ల క్రితం విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులకు అప్లై చేసి భరణం కోసం చైత్ర కోర్టును ఆశ్రయించింది. శనివారం కోర్టుకు హాజరైన చైత్రపై శివకుమార్ కొడవలితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చైత్ర మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.