శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా తొలిరోజు గోపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా చంద్రగిరి మండలం అరిగినవారిపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరై గోపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీకృష్ణ దేవాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మోహిత్ రెడ్డిని గ్రామంలో యువత, నాయకులు, మహిళలు ఘనంగా సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa