వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2010లో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని.. 2019 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన సమన్లకు నిత్యానంద స్పందించకపోవడంతో సెప్టెంబర్ 23లోగా కోర్టు ముందు హాజరు కావాలంటూ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.