దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాడులు చేస్తామని ఉగ్రవాదులు శనివారం బెదిరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల కంట్రోల్ రూమ్‌కు సందేశం వచ్చింది. దీని గురించి ఆరా తీయగా, అది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 26/11 తరహా దాడులు చేస్తామని ఉగ్రవాదులు ఆ సందేశంలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa