చిలకలూరిపేట: గొట్టిపాడు ఇంచార్జి సర్పంచ్ నువ్వుల సుధాకరరావు (62) శుక్రవారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య నిర్మల, కుమారుడు విక్రాంత్ పరిమల్, కుమార్తె వైశాలి ఉన్నారు. సుధాకర రావు మృతికి మాజీ మంత్రి, టిడిపి ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు. రెండేళ్ల వ్యవధిలోనే సర్పంచ్, ఇన్చార్జి సర్పంచ్ మృతి చెందటం గమనార్హం.