ప్రస్తుతం టీమిండియా జట్టు జింబాబ్వే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి వన్డే లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను రెండో వన్డేతోనే సొంతం చేసుకునే ఉద్దేశంలో టీమిండియా ఉంది. ఈ క్రమంలో శనివారం జింబాబ్వే తో జరిగే రెండో వన్డేలో టాస్ నెగ్గిన కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యచ్ కోసం భారత్ ఒక మార్పును చేసింది. అదే సమయంలో జింబాబ్వే రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన దీపక్ చహర్ ను పక్కన పెట్టారు.
భారత్ ను జింబాబ్వే ఆపగలదా
భారత్ తో సిరీస్ కంటే కూడా ముందు బంగ్లాదేశ్ తో వన్డే, టి20 సిరీస్ లను జింబాబ్వే ఆడింది. టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసిన జింబాబ్వే.. వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. దాంతో యువ ప్లేయర్లతో పెద్దగా అనుభవం లేని టీమిండియాకు జింబాబ్వే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపించింది. అయితే తొలి వన్డే చూశాక.. జింబాబ్వే భారత్ ముందు కూన అని తేలిపోయింది. ప్రత్యర్థిని 200 పరుగుల లోపే ఆలౌట్ చేయడంతో పాటు.. లక్ష్యాన్ని వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించిన టీమిండియా జింబాబ్వేపై భారీ విజయంతో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో వన్డేలోనూ భారత్ విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అదే సమయంలో తొలి వన్డేలో చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా ఈ మ్యాచ్ లోనైనా పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. అయితే తొలి వన్డేలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ చహర్ ను ఈ మ్యాచ్ కు తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదో సమాచారం లేదు.
తుది జట్లు
టీమిండియా
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్, మొహమ్మద్ సిరాజ్
జింబాబ్వే
కైటానో, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ మదావెరె, సికిందర్ రాజా, రెగిస్ చకబ్వ (కెప్టెన్), రైన్ బుర్ల్, లూకె జాంగ్వె, బ్రాడ్లీ ఎవాన్స్, విక్టర్ నైచి, తనక చివాంగ