బాపట్ల పట్టణంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలోని జమ్మలపాలెం ఫ్లైఓవర్ దిగువున ఉన్న జగనన్న కాలనీ వైపు ఉన్న ప్రైవేటు వెంచర్ కి ఇసుకలోడు లారీలు అతివేగంగా వెళుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పట్టపగలు అనుమతులు లేకుండా యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.