తాడిపత్రి: వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డిఎస్పి చైతన్య శుక్రవారం తెలిపారు. ఈనెల 31న వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేయబోయే పందిళ్లకు నిర్వాహకులు ముందస్తుగా అనుమతి పొందాలన్నారు. ఇందుకోసం తాడిపత్రి సబ్ డివిజన్ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.