ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. లక్నో నగరానికి ఉత్తర-ఈశాన్యంగా 139 కిలోమీటర్ల దూరంలో, తెల్లవారుజామున 1.12 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో భయకంపితులైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు.