ఏపీలోని విజయవాడలో నూతన కోర్టు భవన సముదాయాన్ని శనివారం సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్ మాటిచ్చారని, ఇచ్చినట్లుగానే సహకరించి నిధులివ్వడంతో న్యాయస్థానాల సముదాయం పూర్తయిందన్నారు. విశాఖపట్నంలో కూడా భవనాల నిర్మాణాలకు నిధులిచ్చి ఆ భవన నిర్మాణాల పూర్తికి సీఎం జగన్ సహకరిస్తారని ఆశిస్తున్నానని సీజేఐ పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa