పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ అంశాన్ని రెండు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. అక్కడి ప్రజలు అదే కోరుకుంటున్నారని అన్నారు. కశ్మీరీ ప్రాంతంలో శాంతి స్థిరత్వం అవసరమని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం పాత్ర అవసరమని చెప్పారు. పాక్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా వచ్చిన నీల్ హాక్సిన్‌తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.