కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీతను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులతో సాధారణ పీతల కంటే విభిన్నంగా కనిపిస్తోంది. దీనికి 'ద్వివర్ణ' అని నామకరణం చేశారు. భారత్‌లో ఇప్పటివరకు కనిపెట్టిన 75వ పీత జాతిగా ద్వివర్ణ గురించి వివరించారు శాస్త్రవేత్తలు. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ 75వ జాతి పీతకు శాస్త్రీయంగా అంగీకారం లభించడం విశేషం.