కరోనా సమయంలో వృద్ధులకు ట్రైన్ టికెట్లపై రాయితీలను ఎత్తివేసిన రైల్వే శాఖ.. త్వరలో ఆ సేవలను తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించనుంది. రాయితీలను పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్లీపర్ క్లాస్, ఏసీ-3టైర్ క్లాస్ ప్రయాణికులకు రాయితీలు ఇవ్వాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై త్వరలో రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.