హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు 25వ తేది వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. వర్షాలకు భారీగా ఆస్థి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లింది. వివిధ ఘటనల్లో 14 మంది దుర్మరణం చెందడంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు. నూర్పూర్ వద్ద చక్కి ఖాడ్‌లో బ్రిటిష్‌వారు నిర్మించిన అతి పురాతన రైల్వే వంతెన కొట్టుకుపోయింది.