స్టార్ షట్లర్ పీపీ సింధు 'ఆలీతో సరదాగా' షోకు అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన పలు విషయాలను ఆమె పంచుకున్నారు. హీరో ప్రభాస్ అంటే ఇష్టమని, భవిష్యత్ లో తన బయోపిక్ లో నటించే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకూ తనకు చాలా ప్రేమలేఖలు వచ్చాయని, గతంలో ఓ 70 ఏళ్ల వ్యక్తి తనకిచ్చి పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేస్తానని లేఖ ద్వారా బెదిరించినట్లు చెప్పుకొచ్చింది.