కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేష్ పూర్ కు చెందిన భరత్..శరణ్య అనే అమ్మాయిన ప్రేమించాడు. ఈ విషయం ఆమెకు తెలుపగా యువతి నిరాకరించింది. దీంతో శరణ్యని హత్య చేయాలని భరత్ ప్లాన్ వేశాడు. ఆగష్టు 3న ఆమె ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తుండగా కారుతో ఢీకొట్టాడు. యువతి చికిత్స పొందుతూ 4న మరణించింది. పోలీసుల విచారణలో ఈ దారుణం బయటపడింది. పోలీసులు భరత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.