కాలేజీ బస్సు, కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయాలైన ఘటన కర్ణాటకలోని బెళగావిలో జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సును కంటైనర్ వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వాహనాలు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. బస్సులో దాదాపు 75 మంది విద్యార్థులుండగా అందులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa