హాలీవుడ్ సినిమాలోని ఐకానిక్ ఫ్రాంచైజీలలో ఫైనల్ డెస్టినేషన్ చిత్రం ఒకటి. తాజా విడత ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ జూన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు బిఎంఎస్ స్ట్రీమ్‌లో రెంటల్ బేస్ పై విడుదలైంది. తాజాగా ఇప్పుడు A రేటెడ్ హర్రర్ థ్రిల్లర్‌ను ప్రాంతీయ భాషలలో చూడటానికి జియో హాట్‌స్టార్ అవకాశం ఇస్తోంది. అక్టోబర్ 16, 2025 నుండి ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు తమిళంలో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి జాక్ లిపోవ్స్కీ మరియు ఆడమ్ స్టెయిన్ దర్శకత్వం వహించారు మరియు కైట్లిన్ శాంటా జువానా, టీయో బ్రియోన్స్ మరియు రిచర్డ్ హార్మోన్ కీలక పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa