జీ5లో ప్రసారమైన 'జయమ్ము నిశ్చయమ్మురా' కార్యక్రమంలో నటుడు నాగచైతన్య పాల్గొని, తన కెరీర్, జీవితంలోని ఒడుదొడుకులను అధిగమించడం గురించి మాట్లాడారు. 'మహానటి' సినిమాలో తన తాతయ్య ఏఎన్నార్ పాత్రను పోషించడంపై అనుభవాలను పంచుకున్నారు. మొదట్లో ఆ పాత్ర చేయడానికి సంశయించినా, ఏఎన్నార్‌పై ప్రేమతో, ఆ పాత్రను వేరే నటుడు చేయకూడదనే ఉద్దేశ్యంతో ఒప్పుకున్నానని, ఇది తన అదృష్టమని, ఏఎన్నార్‌పై ప్రేమను చూపించే అవకాశమని నాగచైతన్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa