ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ‘ఏఏ22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్రం ముంబయిలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా అత్యాధునికంగా ఉండబోతోంది. దర్శకుడు అట్లీ తెలిపినట్టు, ఇందులో ఉపయోగించే టెక్నాలజీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇవ్వడంతో, అల్లు అర్జున్ ఓ రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి విదేశాల్లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా స్నేహ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేయగా, అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa