ప్రముఖ నటుడు బ్రహ్మానందం, ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 4 షోలో పాల్గొని, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు. తన కుటుంబంతో ఎస్పీబీకి ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన మరణం ఇండస్ట్రీకే కాకుండా తమకు కూడా తీరని లోటని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఈ సంఘటనతో జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa