యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా 'కె-ర్యాంప్' విడుదల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం ఈ దైవ దర్శనం చేసుకుంది. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఆలయం వెలుపల మీడియాతో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తాము నటిస్తున్న 'కె-ర్యాంప్' చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కిరణ్, యుక్తిల తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa