ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'బాఘి 4'

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 03:53 PM

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన 'బాఘి 4' ఇటీవలే విడుదల అయ్యింది. కన్నడ చిత్రనిర్మాత ఎ. హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క హై-ఆక్టేన్ స్టంట్స్ మరియు మాస్ అప్పీల్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 17 నుండి రెంటల్ బేస్ పై ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనమ్ బజ్వా, మరియు హర్నాజ్ సంధు  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాజిద్ నాడియాద్వాలా ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa