బిగ్ బాస్ లో ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ షో రసవత్తరంగా మరియు ఆసక్తికరంగా నడుస్తుంది. గతవారం ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్స్ లో హిమజ శాశ్వతంగా హౌస్ కి దూరం కాగా, రాహుల్ తిరిగిరావడం జరిగింది. ఇక ఈ ఈవారం ఎలిమినేషన్ కొరకు బిగ్ బాస్ విధించిన టాస్క్ రసవత్తరంగా సాగింది. ఉన్న సభ్యులను ఇద్దరిద్దరు గ్రూప్ లుగా చేసిన బిగ్ బాస్ వారి బలాలు, ఎదుటివారి బలహీనతలు ఎత్తిచూపేలా డిబేట్ పెట్టారు. ఈ టాస్క్లో ముఖ్యంగా శ్రీముఖి, శివ జ్యోతిల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఏదేమైనా చివరకు కొందరు ఎలిమినేషన్ నుండి ఎస్కెప్ కాగా కొందరు నామినేట్ అయ్యారు. శ్రీముఖి, వరుణ్, రవి, బాబా భాస్కర్ ఈ వారం నామినేషన్ కి ఎంపిక కాబడ్డారు. ఐతే ఈ నలుగురు హౌస్ లో ఉన్న వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడం గమనార్హం. వీరు చాలా తక్కువగా ఎలిమినేషన్ లిస్ట్ కి వస్తుంటారు. దీనితో వచ్చే వారం ఒక టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడనే విషయం మాత్రం ధ్రువీకృతం ఐయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa