సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన `F2`తో సక్సెస్ సాధించిన వెంకటేశ్ ఇప్పుడు `వెంకీమామ` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట. సమాచారం మేరకు ఈ సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందట. పక్కా లోకల్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. హైదరాబాద్ మలక్‌పేటలోని రేస్ క్లబ్‌లో మేజర్ పార్ట్‌ను పూర్తి చేస్తారని కూడా టాక్. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందించనుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa