బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ విషయాన్ని ట్వీట్టర్ వేదికగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. సినిమా రంగంలో గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని ప్రధానం చేస్తారు. ఈ సంవత్సరం ఈ పురస్కారం అమితాబ్ బచ్చన్ కు దక్కింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో పాటు, పలువురు ప్రముఖులు, నటులు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa