ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే 'మాస్ జాతర' ప్రీమియర్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 02:53 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో ప్రముఖ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ప్రీమియర్స్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, నవీన్ చంద్ర, హిమజ, ప్రవీణ్, ఆది కీలక పాత్రలో నటిస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో స్ట్రిక్ట్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa