ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా ప్రభుత్వ ఉద్యోగం కాదు: నిర్మాత ధీరజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 04:03 PM

సినిమా ఇండస్ట్రీలో పనివేళలపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నిర్మాత ధీరజ్ మొగిలినేని స్పందించారు. బాలీవుడ్ ప్రముఖ నటి పనివేళలపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి, సినిమా అనేది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగం కాదని ఆయన అన్నారు. సినిమాపై ఫ్యాషన్ ఉన్నవారు పనివేళలు లెక్కించరని, అర్ధరాత్రి వరకు కూడా షూటింగ్స్ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa