కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత ఏడాది మహానటి మూవీలో ఎస్ వి రంగారావు పాత్రలో కనిపించారు. ఆ చిత్రం తరువాత ఆయన మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. ఐతే ఈ విలక్షణ నటుడు తమిళంలో రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి సూర్య హీరోగా తెరకెక్కుతున్న సురారై పోట్రు కాగా మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియన్ సెల్వమ్ మరొక చిత్రం. ఈ రెండు చిత్రాలలో మోహన్ బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సురారై పోట్రు చిత్రాన్ని గురు ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక మణిరత్నం చోళుల కథ పై ఓ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం లో ఐశ్వర్య భర్తగా మోహన్ బాబు నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, కీర్తి సురేష్, అమలా పాల్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ ఏడాది నవంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa