సీనియర్ నటి ప్రగతి ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన ప్రగతి, రెండున్నరేళ్ల క్రితం మానసికంగా కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల సూచనతో వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్నానని, అయితే ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, క్రీడల్లో గానీ ఎలాంటి ప్రత్యక్ష ఫలితం కనిపించలేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa