'మైసా' చిత్రం యాక్షన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రంలో అమాయక యువతిగా కనిపించిన రష్మిక మందన్న, 'మైసా'లో ఒళ్లంతా రక్తం, చేతిలో గన్, కళ్లలో కోపంతో గిరిజన తిరుగుబాటు యువతిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం గోండు గిరిజన తెగల నేపథ్యంలో అన్యాయానికి ఎదురు నిలిచే సహజ నాయకురాలి కథగా ఉండనుంది. అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa