ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వసూళ్ల దిశగా నడుస్తున్న మళయాళ చిత్రం 'ఎకో'

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 02:56 PM

మలయాళంలో ఈ నవంబర్లో విడుదలైన సినిమానే 'ఎకో'. దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన మొత్తం 5 కోట్లు మాత్రమే కావడం ఇక్కడి విశేషం. అలాంటి ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ రోజున 'నెట్ ఫ్లిక్స్' తెరపైకి వచ్చేసింది. అయితే అది కూడా కేవలం మలయాళంలో మాత్రమే. నిజానికి ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలో కూడా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. అయితే మిగతా భాషలలో జనవరి 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని అధికారికంగా తెలియజేశారు. మలయాళ భాష తెలియకపోయినా ఈ  సినిమా చూడొచ్చు. కథాకథనాలతో పాటు అద్భుతమైన లొకేషన్స్ కనువిందు చేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa