యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం జనవరి 14న విడుదల కానుంది. 2024లో జరిగిన ప్రమాదం వల్ల షూటింగ్ కి దూరమైన నవీన్, కోలుకున్నాక ఈ సినిమా కథను బృందంతో కలిసి రాసుకున్నారు. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చానని, సంక్రాంతికి వినోదంతో కూడిన ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa