ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ కవలలకు బాలయ్య స్పెషల్ గిఫ్ట్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 03:23 PM

మెగాస్టార్ చిరంజీవి మనవళ్లు, రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలలకు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక కానుకలు పంపారు. కవల పిల్లలు పుట్టడంతో రామ్ చరణ్ కు వరుసగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ స్నేహితులు.. అందరు వరుసగా మెగా హీరోను విష్ చేశారు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే సోషల్ మీడియాలో చరణ్ ను విష్ చేశారు. పర్సనల్ గా కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. స్పెషల్ గిఫ్ట్ పంపించాడట. ఇంతకీ ఆయన ప్రత్యేకంగా ఏం భహుమతి పంపించాడటంటే.?


రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టిన సందర్భంగా బాలయ్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ పూల బొకేను పంపించాడట. దానితో పాటు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఫోటో, ప్రసాదం కూడా పంపించాడట. అంతే కాదు పిల్లలకు స్పెషల్ గా టాయ్స్ కూడా పంపించినట్టు టాలీవుడ్ లో టాక్ గట్టిగానడుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఈ విషయంపై మెగా, నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బాలయ్య కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారట రామ్ చరణ్ అభిమానులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa