ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫంకీ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 08:45 PM

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'ఫంకీ' ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 7న మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. గతేడాది హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే విశ్వక్ సేన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa