ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్స్‌లోనూ 'ధురంధర్' సంచలనం.. 10 రోజుల్లో 15.8 లక్షల వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:27 PM

థియేటర్లలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా 'ధురంధర్' చిత్రం అద్భుతమైన రికార్డులను నెలకొల్పుతోంది. జనవరి 30 నుండి ఫిబ్రవరి 8 వరకు 10 రోజుల్లో ఈ చిత్రానికి 15.8 లక్షల వ్యూస్ వచ్చాయి. భారతీయ సినిమాలకు సంవత్సరాల తరబడి నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న సినిమాలకు ఇన్ని వ్యూస్ రాలేదని విశ్లేషకులు అంటున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్' ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ భారత గూఢచారిగా నటించాడు. ఇండియాను టార్గెట్ చేసిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించే లక్ష్యంతో పాకిస్థాన్‌లోని లైయారీ ముఠాలలోకి చొరబడతాడు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించగా, సారా అర్జున్, రాకేష్ బేడీ సహాయ పాత్రల్లో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ చిత్రం త్వరలో #RRR సాధించిన 43 మిలియన్ వ్యూస్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. 'ధురంధర్ 2 : ది రివెంజ్' చిత్రం వచ్చే నెల 19న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa