ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ వచ్చేసింది..

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 04:14 PM

 


నిఖిల్‌ (Nikhil) హీరోగా సంయుక్త‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం స్వయంభు (Swayambhu). భరత్‌ కృష్ణమాచారి (bharat krishnamachari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను పిక్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై భువన్‌, శ్రీకర్ నిర్మించారు. రేండేండ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి అయింది. వేస‌విలో పాన్ ఇండియాగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి టీజ‌ర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 17 సెక‌న్ల పాటు ఉన్న ఈ టీజ‌ర్ అద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది.వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా ‘స్వయంభు’ సినిమా ఆలస్యమైందని హీరో నిఖిల్ తెలిపారు. ఒక్క సీన్‌ పర్‌ఫెక్ట్‌గా లేకపోయినా ప్రేక్షకులు క్షమించడం లేదని, సీజీ లోపాలు సినిమాకు నష్టం కలిగిస్తాయని చెప్పారు. 2వేలకు పైగా సీజీ షాట్స్‌ ఉన్న ఈ పీరియాడికల్‌ హిస్టారికల్‌ డ్రామాను నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చి రూపొందిస్తున్నామని అన్నారు. ఏఐను ఉపయోగించలేదని స్పష్టం చేశారు. అలాగే, ఈ ఏడాది చివర్లో ‘కార్తికేయ3’ ప్రారంభమవుతుందని వెల్లడించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa