టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానంలో తొలి అడుగు వేసిన రోజును గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నది ఫిబ్రవరి 11నే అని ఆయన తెలిపారు. 'పునాదిరాళ్లు' సినిమా కోసం తాను తొలిసారి నటించిన ఆ రోజును గుర్తుచేసుకుంటూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.ఆ రోజు తనలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత వంటి భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేమని చిరంజీవి పేర్కొన్నారు. ఆ క్షణం ఇప్పటికీ నిన్నమొన్న జరిగినట్లే ఉందని, అదొక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా, తనకు ఆ తొలి అవకాశం ఇచ్చిన 'పునాదిరాళ్లు' చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం, ప్రోత్సాహంతోనే నటనలో తన ప్రయాణానికి పునాది పడిందని చిరంజీవి వివరించారు.అంతేకాకుండా తన సినీ ప్రయాణం మొదలైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనను నిరంతరం ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ చిరంజీవి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa