మంచు లక్ష్మి సినీ నిర్మాణ రంగంలో తాజాగా ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తాను నిర్మించిన ఒక సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చిందని ఆమె తెలిపారు. ఆ నష్టాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని చెప్పారు. ఆ సినిమా కోసం చేసిన అప్పులను ఇప్పటికీ కట్టుకుంటున్నానని తెలిపారు. అందుకే నిర్మాతగా తన జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయిందని చెప్పారు. ఇకపై నటనపైనే పూర్తి దృష్టి పెడతానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa